Monday, October 14, 2013

హలో...........హలో........

              చెన్నై లో విమానం దిగిన సాగర్ సాకేత్ తిన్నగా ఇంటికి వెళ్లారు.  ఆ రోజంతా వాళ్ళకి ఇల్లు సర్దటం తోనే రాత్రయింది. చక్కగా భోజనం చేసి సాకేత్ ఎప్పటిలానే తొమ్మిది గంటలకు పడుకున్నాడు.  శృతి కూడా ఎప్పటిలానే ఆ సాయంత్రం సముద్రం ఒడ్డున కూర్చొని డైరీ రాసుకుని ఇంటికి వెళ్లి తినేసి మంచం ఎక్కింది. రోజూలాగానే ఈ రోజు కూడా నిద్రకి ఉపక్రమించేముందు తన ఫోన్లో తన subconscious లో ఉన్న నెంబరు డయల్ చేసింది. ఎప్పటిలానే ఆ రోజు కూడా నెంబరు మనుగడలో లేదు అని వస్తుంది అనుకొంటూ ఉంది. కానీ నెంబరు రింగ్ అయ్యేసరికి శృతికి కొంచెం కంగారు వచ్చింది. అవతలి వైపు ఎవరు ఫోన్ తీస్తారో ఏం మాట్లాడాలో అనే అయోమయంలో ఉండగా రింగ్ ఆగి అవతల నుండి హలో అని వినిపించింది.
అవతల వ్యక్తి : హలో..........హలో
  శృతి కి ఏం మాట్లాడాలో తెలియటం లేదు. ఆ గొంతు పరిచయమే అనిపిస్తున్నా ఎవరిదో గుర్తు రావట్లేదు. ఆనందం అయోమయం కలసి తన ఆలోచనలకు ఆనకట్ట వేస్తున్నాయి. ఇంతలో మరలా అవతల గొంతు వినిపించింది.
అవతల వ్యక్తి : హలో.... ఎవరు మీరు
శృతి : (చిన్నగా) హలో
ఇప్పుడు అవతల వ్యక్తి గొంతు ఒక క్షణం మౌనంగా ఉంది
అవతల వ్యక్తి : హలో
శృతి ఏం మాట్లాడలేకపోతుంది. ఏదో తెలియని ఆనందం ఆమె కళ్ళలో నీళ్లు నింపాయి.
అవతల వ్యక్తి : (చిన్నగా) శృతి.......
ఒక్క సారిగా శృతి ఉలిక్కిపడింది......
శృతి : నేను.......నేను........నేను గుర్తున్నానా!!??
అవతల వ్యక్తి : ఎక్కడున్నావు శృతి. ఏమయిపోయావు.
శృతి గొంతు పెగలటం లేదు
అవతల వ్యక్తి : మాట్లాడు శృతి. అర్ధాంతరంగా అందరినీ వదిలేసి వెళ్లి పోయావు.
శృతి మాట్లాడలేకపోతుంది.
ఇంతలో ఫోన్ కట్ అయింది.  శృతి ఫోన్లో బేలన్స్ అయిపోయింది. ఆ రాత్రి సమయంలో రిచార్జ్ దొరకదు కనుక చేసేదేం లేక  భారంగా పడుకొని నిద్ర లోకి జారింది.
     ఆ రోజు తన కలలోకి సాగర్ వచ్చాడు. చాలా చిన్నగా వర్షం పడుతోంది. అపుడపుడే చీకటి పడింది. ఫ్లై ఓవర్ కడుతుండటం వల్ల టి.నగర్ రోడ్డు ఇటుకలు సిమెంటు తో నిండి పోయింది. శృతి సాగర్ పాప్ కార్న్ తింటూ ఆ అందమైన సాయంత్రాన ఒకరి చేయి ఒకరు పట్టుకొని నడుచుకుంటూ ఒకరి మీద ఒకరికున్న ప్రేమని ఆస్వాదిస్తునారు. శృతికి చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంతలో మెలకువ వచ్చింది.........
      
      

4 comments:

  1. internet recharge vaadochhuga bhayya .. :) sorry sorry ..cool narration... carry on the same style..but ofcourse with convincing logics..

    ReplyDelete
    Replies
    1. Glad that you asked.......oka ammayi....thanakantu em ledu...chinna teacher job chestu rojulu gadipestundi...how can one expect her to have an internet connection?

      Delete
  2. Nuv call back cheyochu kada ra... :-P

    ReplyDelete
    Replies
    1. Next post chaduv. Samadhanam Nikae dorukuthadi

      Delete