Friday, November 15, 2013

ప్రేమ ఒక అయోమయం :)

                                       
   

 చెన్నైలో దిగిన సాగర్ , సాకేత్ ఆ రోజంతా ఇల్లు సర్దటం వంటి పనుల్లో మునిగిపోయారు . అలసిపోవటంతో సాకేత్ త్వరగా నిద్ర పోయాడు. సాగర్ తన రూమ్ లో మంచం మీద కూర్చొని ఉన్నాడు . చాలా సంవత్సరాల తర్వాత చెన్నై వచ్చాడు . ఏవేవో చేదు జ్ఞాపకాలు తనని వెంటాడుతున్నాయి . ఆ చేదుని తరుముకోచ్చిన ఒక తీపి జ్ఞాపకం తన బాధని హాయిగా మార్చుతోంది . వెంటనే ఆ తీపి జ్ఞాపకపు హాయిని అణచి వేస్తూ వేరొక చేదు జ్ఞాపకం మదిలో మెదులుతుంది . ఈ ఆలోచలనతో సాగర్ ఒక infinite loop లో పడిపోయాడు . అలా  ఆ పిచ్చి peaks కి వెళ్లి సాగర్ మైండ్ ఒక్కసారిగా పూర్తిగా శూన్యం ఆయింది . blank  mind . నిశబ్దం . తన కిటికీ అవతల ఉన్న సముద్రపు అలల హోరు తప్ప వేరొక  శబ్దం లేదు . hmm... అనుకొంటూ ఒక నిట్టుర్పు విడచి మంచం మీద నుంచి లేచి కిటికీ వద్దకు వచ్చి సముద్రం వైపు చూసాడు . చంద్రుని కిరణాలు పడి  సముద్రపు అలలు స్వచ్చమైన పాలవలె అనిపిస్తున్నాయి. కొద్దిసేపు అలా సముద్రం వైపు చూసి సాగర్ , సాకేత్ రూం కి వెళ్ళాడు . సాకేత్ గాఢ నిద్రలో ఉన్నాడు . మెల్లగా చప్పుడు చేయకుండా సాకేత్ రూం డోర్ వేసి సాగర్ సముద్రం వైపు నడిచాడు 

         చెన్నైలో తనకి ఉన్న తీపి జ్ఞాపకాలలో రోజు ఉదయం శృతి తో కలసి సముద్రం ఒడ్డున కూర్చొని సూర్యోదయం చూడటం . కానీ ఈ రాత్రి సాగర్ సంద్రం ఒడ్డున ఒంటరిగా కూర్చొని చంద్రుని చూస్తున్నాడు . శృతి పరిచయం  అయ్యాక తను అలా సముద్రం ఒడ్డున ఒంటరిగా కూర్చొని శృతి కోసం ఎదురుచూసిన జ్ఞాపకం సాగర్ మదిలోకి వచ్చింది . 

" రోజు శృతితో కలసి సూర్యోదయం ఈరోజు ఒంటరిగా కూర్చొని తన కోసం ఎదురు చూస్తున్నా . సూర్యుడు వచ్చేస్తున్నాడు . కానీ శృతి  ఇంకా రాలేదు . తనకి ఫోన్ చేద్దామంటే భయం వేస్తుంది . నా close friend కి call  చేయటానికి నాకు భయం ఎందుకు? ఎందుకంటే ముందు రోజు రాత్రి మా ఇద్దరి మధ్య ఎన్నో జరిగాయి. ఆ రాత్రి ఇడ్లీ వేటతో మొదలై, శృతి కౌగిలి లో బిగిసి , తన ముద్దులలో తడిచి ...... ఎటో వెళ్ళిపోయింది . అలా  ముందు రాత్రి జరిగిన వాటి గురించి తను ఏం ఆలోచిస్తుందో ... సిగ్గుతో రాలేదా లేక నేను advantage తీసుకున్నా అనుకొంటూ కోపం వచ్చి రాలేదా ? ఏదేమైనా ఆ ఉదయం సముద్రం ఒడ్డున ఆ ఒంటరితనం నన్ను భయపెడుతుంది . ఛ . అలా ఏమి అయిఉండదు , రాత్రి చాలా  late  అయింది కదా నిద్ర లేచి ఉండదు అని పాజిటివ్ గా  ఆలోచిస్తూ తనని నిద్ర లేపుదామని call చేశా . సమాధానం లేదు . మరల చెస. సమాధానం లెదు. సర్లే అనుకొంటూ పరీ కి చేశా . తను ఫోన్ తీసి 'ఇంకా bus లో ఉన్నాను రా' అంది .  ' busలోనా . ఎక్కడికి వెళ్తున్నావ్ పరీ ' అని అడిగా . ' ఒరేయి . నువ్వు అసలు friend  వేనా . నెల రోజులు ఇంటికి వెళ్తున్నా అని చెప్పా కదరా . next  week మా office winter  vacation కి close ఒక వారం రోజులు . ఆ పైన శెలవు  పెట్టా . మర్చిపోరా  అన్నీ . నీకు ఈ  మధ్య శృతి  తప్ప ఇంకేం గుర్తుండటం లేదు' అంది . ' అన్ని రోజులు శెలవు  ఎలా ఇచ్చారు ?' అని అడిగా . ' అమ్మాయిలకి అలా  ఇచ్చేస్తారు . ప్రాజెక్ట్ అయిపోయింది . కోతడి లేదు . సో పెట్టేసా . సరె. ఉంటా నెను. battery అయిపోతుంది . జాగ్రత్త పిల్లలు ' అంటూ నవ్వుతూ పరీ ఫోన్ పెట్టేసింది . మరలా శ్రుతి కి call  చేశా . అబ్బే . దేవత కరుణించలేదు . mood off  అయిపోయి room కి వెళ్ళిపోయా . 
     ఆ రోజు ఎప్పటిలానే ఆఫీసు . ఉదయం మరలా  శృతి కి కాల్ చేయలేదు . మధ్యానం  ఫణి నుంచి కాల్ వచ్చింది . ( ఫణి గుర్తున్నాడు కదా. శృతి సహోద్యోగి. పరీ friend .కొంతకాలం క్రితం వరకు మా gang  లో ఉండేవాడు . శ్రుతి  దగ్గర వేషాలు వేయటం వల్ల మేము దూరం పెట్టాం . శ్రుతి  పరీ ఐతే మాట్లాడటం మానెసారు. నేను అపుడపుడు మాట్లాడుతూ ఉండే వాడిని . ఈరోజు అసలే శ్రుతి ఫోన్ తీయక ఏం  ఆలోచిస్తుందో తెలీక కొంచెం అయోమయం కొంచెం చిరాకు లో ఉన్నా . ఈ time లో ఫణి కాల్ వచ్చింది )
ఫణి    :  హాయ్ సాగర్ . ఎలా ఉన్నావ్ 
నేను  :   బానే ఉన్నా . ఏంటి విషయం 
ఫణి    :   ఏం  లేదు . ఊరికే చేశా . 
నేను   :   సరే అయితే . నాకు పనుంది . ఉంటా 
ఫణి    :    అలా  అంటావ్ ఏంట్రా . actually నీతో మాట్లాడాలి . ఎందుకురా మీరందరూ నన్ను అలా దూరం పెట్టేసారు .              ఇదేం  బాలేదు మామ 
నేను  :  నువ్వు చేసింది కూడా బాలేదు కదరా 
ఫణి   : అలా కాదు మామ . నేను చేసింది తప్పే . sorry . ఎన్ని అనుకున్నా మనం friends  కద రా . అన్నీ                            మర్చిపోయి కలిసిపోలేమా .
నాకసలే చిరాగ్గా ఉంది . 
నేను : మనం మాములుగానే ఉన్నాం కదా . అప్పుడపుడు మాట్లాడుకుంటునాం  కద . మధ్యలో శ్రుతి ని ఎందుకు        లాగుతావ్.. తనకి ఇష్టం లేకుండా నేనేం చెయను. 
ఫణి : సరే   మమ. నేనే శ్రుతి  తో మాట్లాడతా .
నేను : ఏదోటి చేసుకో . నాకు పని ఉంది . bye 
అలా  చెప్పి చిరాగ్గా ఫోన్ పెట్టేసా . 
       సాయంత్రం అయింది . రూం కి వచ్చి మంచం మీద కుర్చోన్నా . ఉదయం నుంచి శృతి  దగ్గర నుంచి ఒక call  లేదు . కనీసం ఒక message  కూడా లేదు . అసలు ఇది ఏం  ఆలోచిస్తుందో అనుకొంటునా . ఇంతలో phone మోగింది . శృతి  calling . screen  మిద తన పేరు చూడగానే ఒక్క గెంతున ఫోన్ అందుకొన్నా ... "


       ఇంతలో తన జేబులో ఉన్న ఫోన్ మూగింది . ఆ vibration  కి జ్ఞాపకం నుంచి బయటకి వచ్చాడు సగర్. ఆ నిశబ్దపు రాత్రిలో సముద్రం వైపు చూస్తూ ఫోన్ జేబులోంచి బయటకి తీసి ఎవరు call  చేస్తున్నారా  అని చూసాడు ..  unknown  number  calling . ఎవరా అని ఫోన్ attend  చేసాడు సాగర్ . 

సాగర్ : హలో..........హలో
అవతల నుంచి సమాధానం లేదు 
సాగర్ :  హలో 
ఇంకా సమాధానం లేదు 
అప్పటివరకు తన మైండ్ లో తిరుగుతూ ఉన్న శృతి పేరు అప్రయత్నంగా సాగర్ నోటి నుంచి వచ్చింది 
సాగర్: శృతి ??
అవతల నుంచి : నేను..... నేను ............ నేను గుర్తున్నానా?
( అవతల ఉన్నది శృతి నే . ప్రతిరోజూ లానే ఈరోజు కూడా నిద్రపోయే ముందు తన subconscious లో ఉన్న number  కి dial  చేసింది శృతి . 7కి.మీ అవతల, ఆ రోజే చెన్నై వచ్చి , ముందుగా అనుకున్న విధంగా తన పాత నెంబర్ మీద  కొత్త sim  తీసుకుని , ఒంటరిగా సముద్రం ఒడ్డున కూర్చొని చంద్రుని చూస్తూ జ్ఞాపకాలలో మునిగిపోయిన సాగర్ కి connect  అయింది)
సాగర్ ; ఎక్కడున్నావు శృతి. ఏమయిపోయావు
 మరలా నిశబ్దం 
సాగర్ : మాట్లాడు శృతి. అర్ధాంతరంగా అందరినీ వదిలేసి వెళ్లి పోయావు
మరలా ఒక క్షణం నిశబ్దం తర్వాత ఫోన్ disconnect  అయింది .. తిరిగి మళ్ళా call  చేద్దామా వద్దా  అని అయోమయం లో పడ్డాడు సాగర్ . " అయిదేళ్ళ క్రితం నేను వద్దని నా జీవితం నుంచి వెళ్ళిపోయింది . రెండేళ్ళ క్రితం తన కోసం వస్తే మళ్ళా మాయం అయిపోయింది . ఈసారి ఎవరికీ తెలీదు  ఎక్కడికి వెళ్లిందో . ఉద్యోగరీత్యా పరీ ఆస్ట్రేలియా  నేను అమెరికాలో ఉన్నా తన ఆచూకీ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాం . అమెరికా వదిలేసి ఇక settle  అవుదామని చెన్నై కి ఒచ్చిన వెంటనే శృతి నుంచి call  ఒచ్చింది . అంటే ఎప్పటినుంచో తను నాతో మాట్లాడటానికి ట్రై చేస్తుందా ? ఎందుకు? ఒకవేళ సాకేత్ నా దగ్గరే ఉన్నాడని తెలిసిఉంటదా . ఎప్పటినుంచో ట్రై చేస్తుంటే ఫోన్ నెంబర్ లేకపొతే  నాకో లేక పరీ కో email  ఇచ్చి ఉంటది కద. అలా  ఏం  జరగలేదు . పైగా నేను గుర్తున్నానా అని అడిగింది . ఆ తర్వాత మౌనం . ఎందుకో నేను గుర్తొచ్చి call  చెసిన్దా. వెంటనే కోపం వచ్చి పెట్టేసిందా . కానీ ఇన్నాళ్ళకి కోపం ఎందుకు ఉంటుంది నా మిద. సాకేత్ గురించి నిజం తెలిసి ఉంటుందా . నెలల పిల్లోడిని వదిలి వెళ్ళిపోయింది కదా. వాడిని నేను అనాధ శరణాలయాలలో వదలలేక నాతో ఉంచుకుంటే కోపం తెచ్చేసుకుందా ......." ఇలా ఎన్నో ఆలోచనలతో  అయోమయం తో ఏం అర్ధం కాక అలొచిస్తూ ఇంటికి తిరిగి వచ్చి నిద్రలోకి జారుకున్నాడు సాగర్. 



ఆరేళ్ళ క్రితం :

     ఉదయం నుంచి స్రుతి తో మాటలు లేవు . మద్యనమ్ ఫణి ఫోన్ . ఒక పక్క చిరాకు . మరొక పక్క శృతి ఎం ఆలోచిస్తుందో అనే అయోమయం . సాగర్ మనసులో మాత్రం ముద్దు గురించి సంతోషమే . ప్రేమించిన అమ్మాయి ముద్దు అంటే అమృతమే కదా. కానీ శృతి ఆలోచన ఎలా ఉందో . ఇలా ఉండగా సాగర్ ఫోన్ మోగింది .  శృతి  calling . screen  మిద తన పేరు చూడగానే ఒక్క గెంతున ఫోన్ అందుకొన్నాడు .................. 
            
             to  be  continued ........... 


                                    

Monday, October 14, 2013

హలో...........హలో........

              చెన్నై లో విమానం దిగిన సాగర్ సాకేత్ తిన్నగా ఇంటికి వెళ్లారు.  ఆ రోజంతా వాళ్ళకి ఇల్లు సర్దటం తోనే రాత్రయింది. చక్కగా భోజనం చేసి సాకేత్ ఎప్పటిలానే తొమ్మిది గంటలకు పడుకున్నాడు.  శృతి కూడా ఎప్పటిలానే ఆ సాయంత్రం సముద్రం ఒడ్డున కూర్చొని డైరీ రాసుకుని ఇంటికి వెళ్లి తినేసి మంచం ఎక్కింది. రోజూలాగానే ఈ రోజు కూడా నిద్రకి ఉపక్రమించేముందు తన ఫోన్లో తన subconscious లో ఉన్న నెంబరు డయల్ చేసింది. ఎప్పటిలానే ఆ రోజు కూడా నెంబరు మనుగడలో లేదు అని వస్తుంది అనుకొంటూ ఉంది. కానీ నెంబరు రింగ్ అయ్యేసరికి శృతికి కొంచెం కంగారు వచ్చింది. అవతలి వైపు ఎవరు ఫోన్ తీస్తారో ఏం మాట్లాడాలో అనే అయోమయంలో ఉండగా రింగ్ ఆగి అవతల నుండి హలో అని వినిపించింది.
అవతల వ్యక్తి : హలో..........హలో
  శృతి కి ఏం మాట్లాడాలో తెలియటం లేదు. ఆ గొంతు పరిచయమే అనిపిస్తున్నా ఎవరిదో గుర్తు రావట్లేదు. ఆనందం అయోమయం కలసి తన ఆలోచనలకు ఆనకట్ట వేస్తున్నాయి. ఇంతలో మరలా అవతల గొంతు వినిపించింది.
అవతల వ్యక్తి : హలో.... ఎవరు మీరు
శృతి : (చిన్నగా) హలో
ఇప్పుడు అవతల వ్యక్తి గొంతు ఒక క్షణం మౌనంగా ఉంది
అవతల వ్యక్తి : హలో
శృతి ఏం మాట్లాడలేకపోతుంది. ఏదో తెలియని ఆనందం ఆమె కళ్ళలో నీళ్లు నింపాయి.
అవతల వ్యక్తి : (చిన్నగా) శృతి.......
ఒక్క సారిగా శృతి ఉలిక్కిపడింది......
శృతి : నేను.......నేను........నేను గుర్తున్నానా!!??
అవతల వ్యక్తి : ఎక్కడున్నావు శృతి. ఏమయిపోయావు.
శృతి గొంతు పెగలటం లేదు
అవతల వ్యక్తి : మాట్లాడు శృతి. అర్ధాంతరంగా అందరినీ వదిలేసి వెళ్లి పోయావు.
శృతి మాట్లాడలేకపోతుంది.
ఇంతలో ఫోన్ కట్ అయింది.  శృతి ఫోన్లో బేలన్స్ అయిపోయింది. ఆ రాత్రి సమయంలో రిచార్జ్ దొరకదు కనుక చేసేదేం లేక  భారంగా పడుకొని నిద్ర లోకి జారింది.
     ఆ రోజు తన కలలోకి సాగర్ వచ్చాడు. చాలా చిన్నగా వర్షం పడుతోంది. అపుడపుడే చీకటి పడింది. ఫ్లై ఓవర్ కడుతుండటం వల్ల టి.నగర్ రోడ్డు ఇటుకలు సిమెంటు తో నిండి పోయింది. శృతి సాగర్ పాప్ కార్న్ తింటూ ఆ అందమైన సాయంత్రాన ఒకరి చేయి ఒకరు పట్టుకొని నడుచుకుంటూ ఒకరి మీద ఒకరికున్న ప్రేమని ఆస్వాదిస్తునారు. శృతికి చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంతలో మెలకువ వచ్చింది.........
      
      

Thursday, October 3, 2013

ఏం ముద్దో ఏం మాయో!!


                                       


         మూడు గంటల క్రితం. అది డిల్లీ ఎయిర్ పోర్టు. సాగర్ , సాకేత్ ఇద్దరూ కలిసి చెన్నై విమానం ఎక్కారు. ఆ విమానం చెన్నై చేరటానికి మూడు గంటలు పడుతుంది. విమానం గాల్లోకి లేవగానే అదే వేగంతో అలసటతో ఉన్న సాకేత్ నిద్రలోకి జారాడు. కానీ సాగర్ మాత్రం ఏదో ఆలోచిస్తున్నాడు. అతనికి చెన్నైకి ఎపుడెపుడు చేరతానా అని ఆత్రం. అదే సమయంలో మనసులో చిన్న సంకోచం. ఎన్నో మధురానుభూతులు నింపి , మరెన్నో చేదు ఙ్ఞాపకలని చూపి తన జీవితాన్ని ఎన్నో మలుపులు తిప్పిన ఈ చెన్నై మహానగరాన్ని సాగర్ వదలి ఐదు సంవత్సరాలు అవుతోంది. అందులో ఆఖరి రెండేళ్లు సాగర్ ఈ దేశంలోనే లేడు. మళ్ళా ఉద్యోగరిత్యా భారతదేశానికి వచ్చిన సాగర్ ఇక తన జీవితం చెన్నైలో గడపాలని నిర్ణయించుకున్నాడు. చరిత్ర పుటలలో లిఖించని సంఘటనలు, తన జీవితంలో మాత్రమే ప్రాముఖ్యత ఉన్న అనుభవాలు కళ్ళ ముందుకు వస్తుండగా మెల్లగా కనులు మూసి తన ఆలోచనల చిట్టాని తెరచాడు.
    అపుడు సమయం రాత్రి పన్నెండు కావస్తోంది. మంగళవారం. నేను నిద్రలోకి జారి ఇంచుమించు గంట అవుతోంది. అప్పుడు మోగింది నా ఫోన్. ఈ టైం లో ఎవరా అని చిరాగ్గా , కళ్ళు తెరవకుండా చేతులతో తడుముతూ  ఫోన్ ఎక్కడుందో వెతకి , మీట నొక్కి, చెవిన పెట్టి, నిద్ర మత్తులో "హలో " అన్నాను. " ఏరా, అపుడే పడుకున్నావా " అని అవతల నుంచి శృతి గొంతు వినిపించింది. ఇంకేముంది. వెంటనే చిరాకు , అంతకంతే వేగంగా నిద్ర, ఎగరిపోయాయి. "నిద్ర లో ఉన్నా రా. నువ్వు పడుకోలేదా? ఏం చేస్తున్నావు" అని అడిగా. " లేదురా ఇంకా. బాగా ఆకలేస్తుంది. ఇంట్లో ఈ పరీ పిల్ల మొత్తం తినేసింది. ఏమన్నా తెస్తావేమో అని చేసా" అని ఆశగా అడిగింది శృతి. " అరగంట లో అక్కడుంటా డార్లింగ్ " అని ఫోన్ పెట్టేశా. ఆ అర్ధరాత్రి చాలా రోడ్లు తిరిగి చివరకి వేడి వేడి ఇడ్లీలు సంపాదించా .
    తను నా కోసం ఇంటి బయట ఎదురు చూస్తోంది. ఇద్దరం వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న పార్కు లో బెంచీ మీద కూర్చున్నాం. "ఏం తెచ్చావ్ రా నా కోసం" అనడిగింది శృతి. ఆ చలికాలపు అర్ధరాత్రి లో ఇడ్లీ పొట్లం విప్పగానే ఎగసిన ఆవిరి, బయట చల్లదనానికి మంచులా మారి మా చుట్టూ కమ్మిందా అన్నట్టుంది. తను  ఇడ్లీలు అలానే చేతిలో పట్టుకొని నా కళ్ళలోకి  చూస్తోంది కానీ తినట్లేదు. "ఏరా ఆకలి చచ్చిపోయిందా "అని అడిగా. తను ఒక క్షణం ఆగి ఒక చిన్న నిట్టూర్పు విడచి "నీకేం అర్థం  కాదురా" అంది. నేను నవ్వుతూ  తన చేతిలోని ఇడ్లీలు తీసుకొని తనకి తినిపించాను.తను అలాగే నా కళ్ళలోకి చూస్తూ తింటోంది. నేను, తను, మా చుట్టూ మంచు అంతా ఏదో కొత్తగా , ఆహ్లాదంగా,సంతోషంగా అనిపించింది. అలా తినిపిస్తుంటే తన పెదాలను ముద్దాడుతున్న నా చేతి వేళ్ళు ఆహా ఏమి అదృష్టం చేసుకున్నాయి అని నా ఆలోచనలు గతి తప్పుతున్నాయి. అలా ప్రేమతో తినిపిస్తూ తన కళ్ళలోకి చూస్తూ నన్ను నేను మర్చిపోయాను. నా ప్రాణం నన్ను వదలి తనలో కలసిపోయిందనిపించింది.ఇంతలో స్టోరీ లో ట్విస్ట్. తెచ్చిన ఇడ్లీలు అయిపోయాయి. అలానే కళ్ళలోకి చూస్తూ "ఆకలి తీరిందా "అని అడిగా. తను తల దించుకొని కొంచెం సిగ్గు కొంచెం సంకోచంతో ఊ కొట్టింది. ఇంకొక క్షణం నిశ్శబ్దం తర్వాత గట్టిగా ఊపిరి పీల్చుకొని ఈ ప్రపంచం లోకి వచ్చాం. 
    "ఇక వెళ్దాం పద. రేపు ఆఫీసు ఉంది కదా" అని లేచి తన ఇంటి వైపు అడుగులు వేశాం. తను నన్ను ఆపి ఇలా వద్దు. పార్కు మధ్యలోంచి వెళ్దాం. కొంచెం దగ్గర అని అంది."వద్దు బంగారం. అటు లైట్లుండవ్. పైగా కుక్కలుంటాయి. వద్దు "అంటూ ముందుకు ఒక అడుగు వేశా. శృతి అలిగినట్టు ముఖం పెట్టి "నేను రాను. నేను ఇలానే వెళ్తాను "అంటూ వెనక్కి తిరిగి నడవటం మొదలుపెట్టింది. సరే వెళ్లు అంటూ నేను కొంచెం దూరం ముందుకు వెళ్లాక నా ఫోన్ కి మెసేజ్ వచ్చింది. ఎవరా అని చూస్తే శృతి. " ముద్దిస్తానన్నా రావా :)  " అని ఆ మెసేజ్ సారాంశం. ఇంకేముంది. ఒక్కసారిగా మనసు గట్టిగా వెనుకకి లాగింది. నీ శృతి నీకు ప్రేమతో ముద్దిస్తానంటే ఇకేం ఆలోచిస్తన్నావు రా అని బుద్ధి మందలించింది. బుద్ధి మనసు ఒకేసారి ఒకటే చెప్పటంతో తన వద్దకు పరిగెత్తా. "ఏరా, ముద్దనగానే వచ్చేశావు" అని ఏడిపించింది శృతి. అపుడు నేను తన భుజాల మీద చేయి వేసి తనని నా వైపు తిప్పి చాలా దగ్గరగా వెళ్లి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి " నీ ముద్దు మీద వ్యామోహంతో కాదు శృతి. ఆ ముద్దులో ఉండే నీ ప్రేమ కోసం వచ్చా " అన్నాను. తను సిగ్గు పడుతూ " నీలో కవి కూడా ఉన్నాడా " అంది. ఒక చిన్న నవ్వు నవ్వి ఇద్దరం మళ్ళా నడవటం మొదలుపెట్టాం. ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ముందుకు నడుస్తున్నాం. ఎంతసేపు నడుస్తావురా , తనకి ముద్దు పెట్టు అని మనసు గోల పెడుతున్నా ధైర్యం సరిపోవటం లేదు. నోరు పెగలి మాట బయటికి రానంది. తన ఇంటికి దగ్గరగా వచ్చి ఆగాం. తను అలా తిరిగి ఇంటి వైపు అడుగేస్తుంటే మనసు బరువెక్కింది. తను ఇంకొక అడుగు తను వేయబోతుండగా తన చేయి పట్టుకొని తనని నా వైపు లాగాను.తను దగ్గరగా వచ్చి గుద్దుకొని నన్ను గట్టిగా పట్టుకొంది. తన చుట్టూ చేతులు వేసి మా పెదవులని ఒక్కటి చేసి ముద్దిచ్చాను.  ఆ పెదవుల మృదుత్వం, తన ప్రేమతో నిండిన ఆ ముద్దులోని పాశం కలగలిపిన ఆ మధువుని జీవితంలో మొదటిసారి ఆస్వాదించిన క్షణం, ఒక మధురానుభూతి. 


    ఇంతలో ఎవరోజు తట్టినట్టు అనిపించడంతో ఆ ఆలోచన నుంచి బయటకి వచ్చాడు సాగర్. ఇంకొక ఐదు నిమిషాలలో చెన్నై లో దిగుతాం అని పైలట్ చెప్పటంతో కిటికీ లోంచి కిందకి చూడగా తను ఎప్పుడో దూరమైన బీచ్ కనిపించింది. ఆ బీచ్, దాని పక్కనే చర్చ్ , దగ్గరలో స్కూల్, ఆ స్కూల్ మైదానంలో ఆడుతున్న పిల్లలు. పైనుంచి చిన్నవిగా కనిపిస్తున్నా, వాటినే గమనిస్తూ ఉన్నాడు సాగర్. అదే విమానాన్ని కింద నుంచి చూస్తూ కేరింతలు కొడుతున్న చిన్నారులని గమనిస్తున్న శృతి, పైకి చూసి చిన్నగా నవ్వింది. ఆ నవ్వు సాగర్ ని తాకింది. అతని మనసుని ఆహ్లాదంగా చేసింది. ఐదేళ్ల క్రితం అర్ధాంతరంగా వదలి వెళ్లిన ఆ చెన్నై మహానగరంలో జీవితం కొనసాగించటానికి తన మూడేళ్ల కొడుకు సాకేత్ తో కలిసి విమానం దిగాడు సాగర్......

Friday, September 27, 2013

ఆరు సంవత్సరాల తర్వాత.............

       
                                 


  నా పేరు శృతి. నా గురించి చెప్పుటానికి ఎక్కువ ఏమి లేదు. గత సంవత్సరం నుంచి నా దినచర్యలో మార్పు లేకుండా నా జీవితం సాగిపోతుంది. ఆ దినచర్యలో భాగంగానే ఈ రోజు ఉదయం కూడా సముద్రం ఒడ్డున కూర్చొని ఉదయించే సూర్యుని చూస్తూ ఉన్నా. మానవాళికి వెలుగునివ్వాలనే గమ్యంతో సూర్యుడు సముద్ర గర్భాన్ని చీల్చుకొని బయటికి వస్తున్నాడు. తీరాన్ని తాకాలనే గమ్యంతో సముద్రం మధ్యలో పుట్టిన అల ఎగసిపడుతూ  ముందుకు సాగుతోంది. ఉదయాన్నే వచ్చి ఈ బీచ్ లో ఆరోగ్యం కోసం పరిగెడుతూ  ఉన్న ప్రతి ఒక్కరూ తమ జీవితాలలో సాధించలనుకునే ఏదొక గమ్యం గురించి ఆలోచిస్తూ ముందుకు సాగుతున్నారు. కానీ నా జీవితం మాత్రం గమ్యం లేని గమనంతో ముందుకు సాగుతోంది. ఎందుకంటే నేనెవరో నాకే తెలీదు.

        ఇంతలో చర్చి బెల్స్ మోగటంతో తను రాస్తున్న డైరీ ఆపి, లేచి బీచ్ పక్కనే ఉన్న చర్చికి నడవసాగింది శృతి. దారిలో కనిపించిన సిస్టర్ మేరీ ని కృతజ్ఞతా భావంతో గుడ్ మార్నింగ్ అని పలకరించి చర్చిలోకి ప్రవేశించింది. పూర్తి ధ్యానంతో దేవుని ప్రార్ధించి , చర్చి పక్కనే ఉన్న తన అద్దె ఇంటికి చేరుకొని తన గదిలో కూర్చొని మరల డైరీ రాయటం మొదలుపెట్టింది శృతి.
        ఈ రోజుకి కచ్చితంగా రెండేళ్ల క్రితం సెయింట్ మేరీస్ హాస్పటల్ కి ఇద్దరు వ్యక్తులని ఒక యాక్సిడెంట్ నుంచి కొన ప్రాణాలతో తీసుకొచ్చారు. అందులో ఒకరు నేను.ఇంకొకరు నా భర్త. అతని పేరు నాకు ఇంకా గుర్తు రావట్లేదు. మా ఇద్దరిలో నా ప్రాణాలు నిలబెట్టగలిగారు కానీ నేను ఆరు నెలలు కోమా లో ఉన్నానంట.  నా భర్త ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయారు. మా ఇద్దరినీ రక్తపు మడుగులో స్ట్రెచర్ పై హాస్పటల్ కి తీసుకువచ్చేపుడు నేను స్పృహలో లేనంట. కానీ నా భర్త, మమ్మల్ని స్ట్రెచర్ పై తీసుకువచ్చేపుడు , నా వైపు చూపిస్తూ "మా ఆవిడ. జాగ్రత్త " అని ఎంతో కష్టం మీద అన్నారంట.  ఆరు నెలల తర్వాత కళ్ళు తెరిచిన నాకు ఏమీ గుర్తులేదు. నా పేరు కూడా నేను చెప్పలేక పోయాను. మేమెవరో చెప్పగలిగే ఒక్క ఆధారం కూడా , పర్సు లాంటివి,  హాస్పిటల్ వాళ్ళకి లభించలేదంట. నా తలకి దెబ్బ తగలటం వల్ల అన్నీ మర్చిపోయా అని, మెల్లగా గుర్తొస్తాయని డాక్టర్ చెప్పారు కానీ రెండేళ్లయినా నా పేరు కూడా నాకు గుర్తు రాలేదు , అని రాయటం ఆపి , కన్నీరు తుడుచుకుని మరలా రాయటం మొదలుపెట్టింది.
        నేను కోమా లో ఉన్నప్పుడు , ఆ తర్వాత కూడా సిస్టర్ మేరీ నాకు బాగా కేర్ తీసుకున్నారు. నేను కోమా నుంచి బయటికి వచ్చాక అందరూ నా గతం నాకు గుర్తు చేయటానికి చాలా ప్రయత్నం చేశారు. కానీ ఏ ట్రీట్మెంట్ కూడా నా గతాన్ని నాకు గుర్తు తేలేకపోయాయి. కొన్నాళ్ళ తర్వాత నన్ను కాపాడిన మిషనరీ వారికి భారం కాకూడదని నన్ను నేను పోషించుకునేందుకు సిస్టర్ మేరీ సాయంతో పక్కనే ఉన్న ప్రైమరీ స్కూల్ లో టీచర్ గా జాయిన్ అయ్యా. జాయిన్ అయ్యే సమయంలో నా పేరు కూడా నాకు తెలీదు. కాబట్టి నా పేరు అనామిక అని  టైపు చేసి జాయినింగ్ ఆర్డరు నా ఎదురుగా పెట్టగా నేను అప్రయత్నంగా శృతి అని సంతకం చేశా.  నాతో పాటు అందరం షాక్ అయ్యాం. నాకు మాత్రం షాక్ తో పాటు కొంచెం సంతోషం కూడా కలిసింది. నా గతం గుర్తొచ్చింది అనిపించింది. కానీ రాలేదు. ఆ తరువాత డాక్టర్ అసలు విషయం చెప్పారు. మనం రోజు ఎక్కువగా చేసే పనులు అంటే తినటం మాట్లాడటం చదవటం వంటివి మన sub–conscious mind లో రికార్డు అయి ఎప్పటికీ అలానే ఉంటాయంట. అందువలనే నేను అప్రయత్నంగా శృతి అని సంతకం చేయగలిగా. నా గతం గుర్తు రాలేదు కానీ నా పేరు శృతి అని తెలిసింది ఆ రోజు. ఒక చిన్న సంతోషం. ఆ రోజు నుంచి టీచర్ గా కొత్త జీవితం మొదలయింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు దినచర్యలో మార్పు లేకుండా నా జీవితం సాగుతోంది.
       ఒకరోజు అలానే ఫోన్ చేతిలో పట్టుకొని అప్రయత్నంగా ఒక నెంబరు డయలు చేశా. కానీ ఆ నెంబరు తాత్కాలికంగా పని చేయట్లేదని తెలసి నిస్రృహ కలిగింది. నాతో పాటు ఉన్న మిషనరీ వాళ్ళు కూడా నేనెవరో తెలుసుకోవటానికి వారికి తెలసిన పద్దతులతో దినపత్రిక లో ఫొటోలు ప్రచురించటం, పోస్టర్లు అతికించటం ద్వారా ప్రయత్నించారు కానీ అవేమీ సఫలమవలేదు. ఈ రోజుకి నా యాక్సిడెంట్ జరిగి రెండేళ్లవుతుంది. కానీ నేనెవరో నాకింకా తెలీదు. సిస్టర్ మేరీ సలహా తో నాలోని ఒంటరితనాన్ని తట్టుకోటానికి నాకు గుర్తున్న జీవితాన్ని ఈ రోజు ఇలా  డైరీ లో  పెడుతున్నా. గమ్యం లేని గమనం తో సాగిపోతున్న నా జీవితానికి ప్రతిబింబమే ఈ డైరీ.........అంటూ ఫుల్ స్టాప్ పెట్టి డైరీ మూసింది శృతి.
   ఆ రోజు కూడా తన జీవితం ఎప్పటిలానే గడిచింది.ఉదయం నుంచి సాయంత్రం వరకూ పాఠాలు అటుపైన ఆటలు ఆడుతున్న బాల్యాన్ని చూస్తూ తనవైన ఆలోచనలలో మునిగిపోయింది. ఇంతలో తమ పైనుంచి విమానం ఎగురుకుంటూ వెళ్తుండటంతో పిల్లలు ఆట ఆపి దాన్నే చూస్తూ నుంచొనిపోయారు. వారిని చూసిన శృతి పెదాల మీద చిరునవ్వు విరసింది.తనకి తెలియని విషయం ఏమంటే తను ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తన జీవితం ఆ విమానంలోనే ఉందని. విమానాన్ని చూసి కేరింతలు కొడుతున్న ఆ పిల్లల అమాయకత్వం చూస్తూ, అదే విమానం నేలని తాకినంక తన జీవితమే మారిపోతుంది అని తెలియని అమాయకత్వంతో, చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరింది శృతి........

Saturday, September 21, 2013

ఆరోజు అప్పుడు అలా

                      
                                          


   అలా మా ఇద్దరి మధ్య ప్రేమ మొధలయింది.  కానీ అప్పుడే మేము వ్యక్తపరచుకోలేదు. అదేదో సినిమాలో చెప్పినట్టు ( నిజమేనండి. అబద్దాలు కాదు. నిజంగా సినిమా పేరు గుర్తు లేదు. మీకు తెలిస్తే కమెంటు వేయండి ) , మనం ప్రేమించిన వ్యక్తి మనల్ని ప్రేమిస్తుందని తెలసి కూడా , ఆ  ప్రేమని బయటపెట్టకుండా తన చుట్టూ తిరగటంలో ఒక కిక్కు ఉంది. ఆ రోజు తర్వాత అన్నీ ఎప్పటిలానే ఉన్నాయి.  వారమంతా ఉద్యోగం. వారాంతంలో ఆ వేడిని చల్లపరచటానికి ఫ్రెండ్స్ తో షికార్లు. కానీ నాకు శృతికి మాత్రం మధ్య ఎవరూ గమనించని కొత్త ప్రపంచంమే ఉంది. కళ్ళతోనే మాట్లాడుకునేవాళ్ళం. కనుసైగలు కొంటెచూపులు కామన్ అయిపోయాయి. తన పక్కనే నడుస్తుంటే  తగిలి తగలక కలిసే చేతులు, అపుడపుడూ రివ్వున ఎగసి నా ముఖాన్ని ముద్దాడే తన కురులు ఇలా ఒకటేమిటి, తన పక్కన ఉన్నపుడు ప్రతి విషయం కొత్తగా అనిపించేది. 
      ఇలా రోజులు గడుస్తుండగా ఒక రోజు నేను శృతి పరీ ముగ్గురం పిజ్జా తినటానికి వెళ్ళాం. నా పక్కన పరీ ఎదురుగా కూర్చొన్నారు. శృతి నా వెనుక టేబుల్ లో కూర్చొని ఉన్న జంటవైపు అదేపనిగా చూస్తూ నవ్వుతూ  ఉంది. అంత కామెడీ ఏం జరుగుతుంది వెనకమాల అని అడిగితే శృతి చెప్పింది. "నీ వెనుక కూర్చొని ఉన్న ఇద్దరి లో అబ్బాయి ఆ అమ్మాయి ని ఇంప్రెస్ చేయటానికి తెగ తంటాలు పడుతున్నాడు. ఎంతైనా మీ అబ్బాయి లు అమ్మాయిలని ఇంప్రెస్ చేయటానికి బాగా కష్టపడుతుంటారు" అంది . నవ్వుతూ. అంత లేదమ్మా. అబ్బాయి తలచుకుంటే అమ్మాయిలని అవలీలగా ఆకట్టుకోగలరు అని నేనన్నాను. అన్నీ మాటలు తప్ప అక్కడ విషయం ఏం ఉండదు అని తనంది. పదిహేను నిమిషాల లో నేను చెప్పింది కరెక్ట్ అని నీ చేత అనిపిస్తా అని సవాలు విసరబోతుంటే పిజ్జా రావటంతో తిండి మీద పడ్డాం.
      ఎందుకు చేశానో తెలీదు గానీ పిజ్జా తింటునంతసేపు నేను శృతి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తానే ఉన్నా. మొదట్లో తను ఇబ్బంది ఫీల్ అయింది కానీ తర్వాత తను కూడా నన్ను తీక్షణంగా చూడసాగింది. మా ఇద్దరి మధ్యలో ఒక మైకం అలముకుంది. పక్కన పరిమళ వాగుతూ  ఉన్నా అవేవీ బుర్రలోకి ఎక్కట్లేదు. తెలియకుండానే పరీ కి ఆ ఊ అంటూ సమాధానాలు చెప్పేస్తూన్నాం. అలానే తినటం అయిపోయింది. వాళ్ళిద్దరినీ వాళ్ళింటి దగ్గర దిగబెట్టి టా టా అని చెప్పి బయలుదేరాబోతుండగా సాగర్ అని పిలిచింది. వెనక్కి వచ్చా. శృతి కళ్ళతోనే పరిమళ కి లోపలికి వెళ్లు అని సైగ చేసింది. కానీ తను అడుగు కూడా కదలకుండా నుంచునే ఉంది నవ్వుతూ. ఈ సారి శృతి కొంచెం సీరియస్ గా పరీ వైపు తిరిగి నేను సాగర్తో పర్సెనల్ గా మాట్లాడాలి. నాకు విషయం అర్థం అయిపోయింది. మైండ్ లో రాక్ సాంగ్ మొదలెట్టి అల్లు అర్జున్ లాగా స్టెప్స్కు వేస్తునా.  పరి లోపలికి వెళ్ళిపోయింది . నేను ఏంటి అన్నట్టు శృతి వైపు చూసా . తను ఇక్కడ కాదు అలా నడుచుకుంటూ వెళ్దాం అంది . ఆ అర్దరాత్రి సమయంలో నడుచుకుంటూ అలా కొంచెం దూరం నడిచాం . కానీ తను ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు . నేనుమో తను ఎపుడెపుడు చెప్తుందా అని వెయిట్ చేస్తున్నా. కొంచెం దూరం నడిచాక ఒక చెట్టు కింద నేను నడవటం ఆపి శృతి వైపు తిరిగి ఏం మాట్లాడవేం అన్నట్టు తన కళ్ళలోకి చూసా . తను " అలా చూడకు సాగర్ . నా వాల్ల కావట్లేదు " అని దగ్గరగా వచ్చి నన్ను hug  చేసుకుంది . ఊహించని ఆ ప్రేమ నన్ను అచేతనుడిని చేసింది . నేను ప్రేమించిన వ్యక్తి నన్ను హత్తుకుని ఉంది అనే ఆనందం దానికి తోడయింది. ఇంకేముంది చెప్పండి . ప్రపంచాన్ని జయించా అనిపించింది .
                   
                 శృతి అలాగే నన్ను హత్తుకుని తన మనసులో ఉన్న విషయం బయట పెట్టింది . " సాగర్ . ఈ మధ్య నేను నీకు చాలా దగ్గర అయిపోయా రా . నువ్వు లేకుండా ఉండలేను . నాకు నువ్వు కావాలి " అని అంది . తను నన్ను హత్తుకునే ఉంది. తన చేతులు నా చుట్టూ ఉన్నాయి కానీ నా చేతులు తన చుట్టూ లేవు . కొంచెం సేపటికి తను నన్ను వదిలి న ఎదురుగ నుంచొని అంది " నేను నిన్ను కావలి అనుకున్నట్లు నువ్వు నన్ను అనుకోవాల్సిన పని లేదు . నీకు ఇష్టం లేకుంటే చెప్పేయి " అనగానే నేను తన చేయి పట్టుకుని నా వద్దకు లాగి హత్తుకున్నా . ఇంకేముంది చెప్పండి . నా love  స్టొరీ starts . తనని హత్తుకుని ఎంత సేపు వున్ననో తెలీదు . కాని ఇద్దాం ఆ రాత్రి ఇంకా ఎం మాట్లాడుకోలేదు . ఒకరి హ్సుయి పట్టుకుని ఒకరం అల నచుకుంటూ తన అపార్ట్ మెంట్ వరకు వెల్లమ్. తను లోపలకి వెళ్ళిపోయింది . ఆ రోజు రాత్రంతా నా feeling వర్ణించటానికి నా దగ్గర మాటలు లేవు . అలా ఆ రోజు, ఆ వారం, ఆ సంవత్సరం అలా ఎన్ని రోజులు ఎలా గడుస్తున్నాయో తెలియకుండా సంతోషంగా వెళ్ళిపోతున్నాయి ................... 

(   ఆ ప్రేమ లో ఎన్నో మర్చిపోలేని విషయాలు ఉన్నయి. అందులో కొన్ని  మీ కోసం నా తరువాతి పోస్ట్ లో ..... ) 

Monday, September 9, 2013

సూర్యోదయం

     
                                         



            అలా ఫణి చెప్పిన మాటలు విని శృతి నా మీద చిరాకు పడటంతో నాకు ఇక ఆ రోజు రాత్రి నిద్ర రాలేదు. బాధ తో సోఫా మీద కూలిన నాకు మనసంతా అదే ఆలోచన. కానీ రోజంతా అలసిన శరీరం విశ్రాంతి కోరటంతో, ఎప్పుడు జరిగిందో గానీ నేను నిద్రలోకి జారుకున్నా. శరీర అలసట తీరగానే మెలకువ వచ్చేసింది. అప్పటికి ఉదయం ఐదు అయింది. అంతలోనే శృతి గర్తొచ్చేసింది. ఇక మళ్ళా పడుకోవాలని అనిపించలేదు. లేచి beach కి బయలుదేరా.
                 సముద్రం. తన లోపల ప్రశాంతతని దాచుకొని , ఒడ్డున మాత్రం గంభీరంగా అలలతో ఎగిసిపడే సముద్రం అంటే నాకు చాలా ఇష్టం. చెప్పాలంటే సముద్రం మన జీవితాలని ప్రతిబింబిస్తుంది అని నా ఫిలాసఫీ అండి. సముద్రలో ఉన్న నీరు మన మనోభావాలను పోలి ఉంటుంది. ప్రపంచం లో 90 శాతం మంది ప్రజలు వారి దైనిక జీవితంతో తృప్తి చెంది అప్పుడప్పుడు కలిగే చిన్న చితకా ఆటుపోట్లతో , సముద్రం మధ్యలో ఉన్న నీరు వలె ప్రశాంతంగా కాలంతో సాగిపోతూ  ఉంటారు. మరికొందరు ఏదో సాధించాలనే తపనతో సముద్రపు కెరటాల వలె ఎగసి పడుతూ  ఉంటారు. ఎగసి పడిన కెరటాన్ని సముద్రం వెనక్కి లాగినట్టు జీవితం కూడా ఎన్నో ఆటంకాలను ఎదురుగా నిలిపి వారిని వెనక్కి లాగుతది. కొన్ని కెరటాలు ఒడ్డునే ఆగిపోతాయి. కొన్ని మాత్రం కొంచెం ముందు వరకు వచ్చి ఆగుతాయి. అలానే జీవితం ఎన్నో ఆటంకాలతో వెనక్కి లాగినా ఒక్కొక్కరు వారి వారి బలాలని బట్టి ముందుకు సాగుతూ  ఎంతో కొంత సాధిస్తూ ఉంటారు.  అలాంటి సముద్రం ఒడ్డున కూర్చొని సూర్యోదయం చూడటం అంటే నాకు చాలా ఇష్టం . ఏదో తెలియని ప్రశాంతత ఉంటుంది. ఆ రోజు ఆ ప్రశాంతత కరువయింది కాబట్టే ఉదయాన్నేనిద్ర పట్టక బీచ్ వైపు అడుగుల వేశా.
           అలా బీచ్ లో కూర్చొని సూర్యోదయం చూస్తూ శృతి గురించి ఆలోచిస్తూ ఉన్నా. ఇంతలో నా మొబైల్ మోగింది. అది శృతి నంబరు. ఫోన్ లో పచ్చ బటన్ నొక్కి చెవి దగ్గరకి తీసుకువచ్చా.
నేను : హలో
శృతి :  హలో
నేను : హలో
శృతి : హాయ్ సాగర్
నేను : హాయ్
( మా ఇద్దరికీ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఒక క్షణం సైలెన్స్ తర్వాత .......)
నేను : ఏం చేస్తున్నావు?
శృతి : బీచ్ లో ఉన్నా.
నేను : ఇంత పొద్దున అక్కడేం చేస్తున్నావు?
శృతి : నువ్వేం చేస్తున్నావో అదే చేస్తున్నా.
నేను : నేను బీచ్ లో ఉన్నా అని నీకెవరు చెప్పారు?
శృతి : నాకు కల వచ్చింది ( నవ్వుతూ  )
నేను: hmm .... ఇంతకీ బీచ్ లో ఎక్కడ?
( నా కళ్ళు తను కోసం దూరంగా వెతకసాగినాయి )
శృతి : మన మనసుకి నచ్చే వాళ్ళు ఎప్పుడూ మన ప్రక్కనే ఉంటారు సాగర్. మనమే అది అర్థం కాక ఎక్కడో వెతుకుతూ ఉంటాం. దూరంగా కాదు దగ్గరగా చూడు నేను కనిపిస్తా.
అలా తను అనగానే వెనక్కి తిరిగి చూసా. చంద్రబింబం  వంటి ముఖారవిందంతో నా శృతి ఎదురుగా నుంచొని ఉంది.  తనని చూడగానే అన్నీ మర్చిపోయా. తనని చూసిన ఆనందం లో ఏం మాటలు రాలేదు . తను నా దగ్గరకు వచ్చి , నా అరచేతిని తన అరచేతిలో తీసుకొని ," సారీ రా సాగర్ . రాత్రి ఫణి అలా చెప్పేసరికి బాగా కోపం వచ్చింది . అందుకే చిరాగ్గా మాట్లాడా " అంటూ నా పక్కకి వచ్చి , నా  భుజం మీద తల పెట్టి " నాకు నీ మీద నమ్మకం ఉంది రా . నువ్వు అలా చెయవు. ఇంకెవరన్నా అలా చేసారు అంటే నమ్మేదాన్ని. కానీ నువ్వలా చేస్తావంటే ఎవరు చెప్పినా నమ్మను . ఐ am
రియల్లీ సారీ రా" అంది . నేను తన తల నిమిరి ఒక చిన్న నవ్వు నవ్వా . నాకు ఆ క్షణం బాగా నచ్చింది . నేను , తను చేతిలో చెయ్యి వేసుకొని బీచ్ లో నడుచుకుంటూ ఆ ఉదయాన్ని గడిపాము . ఆ క్షణంలో మా ఇద్దరి మధ్య ప్రేమ మొదలయింది . ఈ సంఘటన జరిగి వలనే మేము ఒకరి గురించి ఒకరం రాత్రంతా ఆలొచించామ్. అపుడే అర్ధం అయింది మాకు ఒకరంటే ఒకరికి ఎంత నమ్మకం, గౌరవం , ప్రేమ . అప్పటివరకు మా ఇద్దరి మధ్య ఉన్న ఇష్టం ఆ రోజు ప్రేమగా మారింది .......
మరి అది ఎలా బయట పెట్టాం ? ....to  be  continued...............:)

                  

Sunday, September 8, 2013

నేను శృతి మధ్యలో ఫణి

  
                             

         ఆ రోజు పరిమళ పుట్టినరోజు. తను ప్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చింది. అందరం తన పుట్టినరోజుని బాగా జరిపాం. తను కూడా చాలా హ్యాపీ గా ఉంది. కానీ నేను ఆ పార్టీ లో ఒకటి గమనించా. శృతి ఫణితో గొడవపడటం. ఫణి ఎవరు మధ్యలో అని అనుకుంటున్నారా. ఫణి నాకు పరిమళ కి స్కూల్ ప్రెండ్. అంతేకాదు శృతి కి సహోద్యోగి. ఆ విధంగా అతను మా ముగ్గురికి పరిచయం. ఎందుకో తెలీదు కానీ మా ముగ్గురిలో ఉన్న చనువు ఫణికి మాకు లేదు. పైగా తనకి శృతి మీద క్రష్ కూడా. తనని ఇంప్రెస్ చేయటానికి అప్పుడప్పుడు కొన్ని వెధవ ప్రయత్నాలు కూడా చేసేవాడు. కానీ శృతికి నా మీద ఉన్న ఇంట్రెస్టు వల్లనో లేక వేరేమిటో గానీ ఫణి ప్రయత్నాలు ఏమి ఫలించేవి కావు. అప్పుడప్పుడు అవి శృతి చిరాకు కూడా తెప్పించేవి. మాతో చెప్తూ ఉండేది.
   ఇక విషయం లోకి వస్తే పరి పుట్టినరోజు పార్టీలో శృతి ఫణిని తిడుతూ  కనిపించింది. దగ్గరకు వెళ్లి ఏమైంది అని అడిగా. తను ఏం లేదు అని అక్కడి నుంచి వెళ్లిపోయింది. సరే పార్టీ మధ్యలో సీన్ ఎందుకు లే తర్వాత అడుగుదామని నేను వదిలేసా.  పార్టీ అయిపోయింది. నేను నా కారులో పరీని శృతి ని వాళ్ళ రూమ్ లో వదలి నా రూమ్ కి వెళ్లా. స్నానం చేసి ప్రశాంతంగా కూర్చున్నా.  ఇక ఫోన్ పట్టుకొని ఏమైందో తెలుసుకుందామని శృతి కి కాల్ చేసా.  కానీ శృతి చాలా చిరాకుగా నాకు నిద్ర వస్తుంది అని ఠక్కున పెట్టేసింది. చాలా బాధ వేసింది. కొంతసేపటికి పరీ కాల్ చేసింది. ఏరా ఒంటరిగా కూర్చుని బాధ పడుతున్నావా అని అడిగింది . ఛ , అలాంటిది ఏం లేదు రా . నిద్ర రావట్లేదా అని అడిగా . నోరు ముయ్యి రా. మీతో ఉంటూ  నేను ఆ మాత్రం గమనించనా . నాకు తెలుసు లేరా అని పరి అంది . సర్లే గాని ఇంతకీ ఏమైంది , ఎందుకు శృతి అలా చిరాగ్గా ఉంది అని అడిగా . అప్పుడు పరీ అసలు విషయం చెప్పింది . 

                      " మనం ఈగ సినిమా చూడటానికి వెళ్ళిన రోజు గుర్తుందా . ఆ రోజు నువ్వు నేను థియేటర్ దగ్గర వెయిట్ చేస్తున్నాం . ఇంతలో  ఫణి ఫోన్ మాట్లాడుతూ వచ్చాడు కదా . నీకు ఎవరో తెలిసిన వాళ్ళు కనిపించారని ఫోన్ నాకు ఇచ్చి, శృతి ఎక్కడ ఉందో కనుక్కోమని చెప్పి, వాళ్ళని పలకరించటానికి వెళ్ళావు. అప్పుడు నేను నీ ఫోన్ నుంచి శృతి కి కాల్ చేస్తే బిజీ వచ్చింది .  ఎందుకంటే అప్పుడు ఫణి మాట్లాడుతుంది శ్రుతితోనే  కాబట్టి .  ఫోన్ పెట్టేశాక వాడు నా దగ్గరకు వచ్చి చేతిలో నీ ఫోన్ చూసి "సాగర్ ఫోన్ నుంచి కాల్ చేసింది నువ్వెనా . call waiting వస్తోంది అని చెప్పింది శృతి . ఈ మధ్య  తను మన ముగ్గురిలో నాకు preference ఇస్తోంది . సాగర్ గాడు పాపమ్. పిచ్చోడిలా దానికి ట్రై చేస్తున్నాడు " అన్నాడు . వాడు ఆ మాట అనగానే నా మైండ్ బ్లాక్ ఆయింది .  నువ్వు నీ  ఫ్రెండ్స్ తో మాట్లాడి వచ్చేసరికి శృతి కూడా వచేసింది . ఇక నేను కూడా నీకేమి చెప్పలేదు ఆరోజు . అక్కడితో ఆ విషయం మర్చిపోయా . ఈ రోజు పార్టీలో ఫణి శ్రుతితో అన్నాడంట " ఈ  మధ్య సాగర్ , నువ్వు అతనితో కంటే నాతో close వుంటున్నావని  నాతో అంటూ ఉంటాడు . అలా ఏం లేదు అన్నా వినిపించుకోడు. ఈగ సినిమా రోజు నేను నీతో మాట్లాడుతున్నా కదా. అప్పుడు నీకు కావాలని కాల్ చేసాడు.  నువ్వు నా కాల్ కట్ చేసి వాడి కాల్ తీయలేదని , నువ్వు వాడిని దూరంగా పెట్టి నాకు దగ్గరా వస్తున్నావు అని నా తల తినేసాడు ఆ రోజు" అని చెప్పాడంట . ఇంకేముంది దానికి కోపం ,చిరాకు వచ్చేశాయి . అందుకే నీతో మాట్లాడలేదు. నేను తనకి ఫణి అబద్దం చెప్తున్నాడు , అని జరిగిన విషయం చెప్పా . కాని తను కోపంగా ఏం మాట్లాడకుండా రూం లోకి వెళ్ళిపోయింది . " అని పరీ  చెప్పింది . 

                 ఇదంతా విన్నాక నాకేం అనాలో తెలియలేదు . కాని శృతి నా మీద కోపంగా ఉందని తెలిసాక నాలోని ప్రశాంతత ఎక్కడికో పరుగెత్తుకు వెళ్లిపోయింది . నాలో ఒక తెలియని అసహనం . నిద్ర రాలేదు . ఎలాగయినా ఉదయాన్నే తనని కలిసి జరిగింది చెప్పాలి , మనసులో ఉన్న భారం దించాలి అని అనుకొంటూ అలా సోఫా మీద కూర్చొని ఎపుడెపుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నా .................

           


Wednesday, September 4, 2013

నేను , శ్రుతి , పరిమళ

                  
                                

           శృతి. ఆ పేరు లో తెలియని పరవశం. ప్రపంచం లో అంతకంటే అందమైన పేరు ఉండేదేమో. ఈ ఆలోచనలతో ముందుకు సాగుతుండగా మేము కలుసుకుందాం అనుకున్న పార్క్ రానే వచ్చింది. బండి దిగి తనకి సంక్షిప్త సందేశం          ( అదేనండి SMS) పంపారు. ఎక్కడున్నావు అని అడిగిన నాకు పది నిమిషాల లో నీ ఎదురుగా ఉంటా అనే సమాధానం వచ్చింది. సరే అనుకొంటూ ఆ ఉద్యానవనం లో ఒక బెంచీ చూసుకుని చల్లగా కూర్చొన్నా. నిజంగా జరిగిందో లేక నాకు అలా అనిపించిందో గానీ నా కుడివైపు నుండి గాలి రివ్వున దూసుకువచ్చి నన్ను తాకింది.  తల తిప్పి చూసా. కొంచెం దూరంగా తెల్లటి చుడీదార్ లో నుంచొని నా వైపే చూస్తోంది. ఆ గాలికి తనపై పడుతున్న కాగితపు పూల మధ్య భువినుంచి ఇలకు దిగివచ్చి నడచివస్తున్న దేవకన్యలా అనిపించింది. తను నాతో ఏదో చెప్తుంది అనిపిస్తుంది కానీ తనని చూసిన మైకంలో నాకు ఏమి వినిపించటం లేదు. ఒక అరక్షణం తర్వాత మళ్ళీ మాములయ్యాను. లేచి నుంచొని తన వైపు తిరిగా. తను " అంకుల్. కొంచెం బాల్ ఇవ్వండి" అని అంది. నేను కొంచెం అనుమానంతో కళ్ళు నలుపుకొని మళ్ళీ తన వైపు చూసా. అప్పుడు అర్థం అయింది తను శృతి కాదు అక్కడ ఆడుకుంటున్న పిల్లోడు అని. బాబోయ్ అనుకొంటూ చూట్టూ చూసా ఒక సారి.  అందరూ ఆమెలానే కనిపిస్తున్నారు.  తనని కలవటానికి నా మనసు ఇంత తపన పడుతోందా అనుకొంటూ  పక్కకి  వెళ్లి పల్లీ కొనుక్కుని తింటం మొదలుపెట్టా. నోట్లో పల్లీలు బుర్రలో ఆలోచనలు గట్టిగా నలుగుతున్నాయి. అందరూ తసలానే కనిపిస్తుంటే నిజమైన తను ఎదురుగా వచ్చినప్పుడు తనని గుర్తు పట్టేది ఎలా అని ఆరాటపడుతుండగా ఒక ఆలోచన వచ్చింది. అప్పటివరకు కళ్ళతో చూసిన నేను ఒక క్షణం కళ్ళుమూసుకుని గట్టి శ్వాస తీసుకొని మనసుతో చూసా.  కళ్ళు తెరచి ఎదురుగా చూడమంది. కొంచెం దూరంలో నా ఏంజెల్ హాయ్ అంటూ నా వైపు వచ్చింది. అలా తనని రెండో సారి కలిసా. ఆ పరిచయం మా ఇద్దరినీ మంచి స్నేహితులని చేసింది.
           ఆ రోజు మేము చాలా మాట్లాడుకున్నాం. కానీ నాకేమి పెద్దగా గుర్తులేదు. ఏంటి నమ్మట్లేదా? నిజమండీ బాబు. అసలే అందమైన అమ్మాయి. అందులోనూ నాకిష్టమైన అమ్మాయి. అలా పక్కనే కూర్చొని తన కళ్ళలోకి చూస్తూ నవ్వుతూ  మాట్లాడుతుంటే ఇంకేం గుర్తుంటది చెప్పండి. నాకు గుర్తున్న కొన్ని విషయాలు చెప్తా వినండి. తను పుట్టింది, చదివింది హైదరాబాద్. ఉద్యోగం బెంగుళూరు. వారం క్రితం చెన్నై బదిలీ అయింది. ఆ విషయం నా ప్రెండ్ తో మాట్లాడేపుడు వాడు నేను చెన్నైలో ఉన్నా అని చెప్పాడంట. టెంకి పెళ్ళిలో నన్ను notice  చేసింది అంట. అందుకే కాల్ చేసి కలిసా అంది.  అలా మొదలయిన మా  పరిచయం కాలంతో పాటు స్నేహంగా మారింది.  కొన్నాళ్ళ తరువాత మేమిద్దరం తింటానికి ఒక రెస్టారెంట్లో కలిసాం. సరదాగా  మాట్లాడుతుంటే ఒకేసారి మెనూ కార్డు ముఖానికి అడ్డం పెట్టుకుంది. నవ్వుతూ  ఏమైంది అని అడిగా. "డోర్ దగ్గర బ్లూ డ్రెస్ లో ఉంది చూడు ఒక అమ్మాయి , తను నా రూంమేట్ . ఈ వారంలో మంచి ప్రెండ్స్ అయిపోయాం. ఇప్పుడు నన్ను నీతో చూస్తే నాతో ఆడుకుంటుంది" అంది. నేను నవ్వుతూ  ఆ అమ్మాయి మనవైపే వస్తోంది అన్నాను." అవునా . ఈ రోజు నాతో ఆదేసుకుంటుంది .  ఏదోటి సోది చెప్పాలి " అంది . తను వచ్చి శృతి పక్కన నంచుంది . శృతి ఒక వెకిలి నవ్వు వేసుకుని ఆ అమ్మాయి వైపు తిరిగి " ఏంటి పరీ ఇలా వచ్చావు " అంది . ఆ అమ్మాయి నవ్వుతూ " రెస్టారెంట్ కి సినిమా చూడటానికీ వస్తారా. ఆకలేస్తే తింటానికి వచ్చా" అంటూ నా వైపు తిరిగి " ఏరా సాగర్ నీకు ఇదెక్కడ దొరికిందిరా" అంది. శృతికి షాక్. " నీకు పరిమళ తెలుసా" అని అడిగింది. " అది అంత మర్యాదగా ఏరా అంటే తెలిసేవుంటుంది కదా శృతి " అన్నాను. 


     పరిమళ  నేను నవ్వుతూ  శృతి కి విషయం చెప్పాం. మేమిద్దరం కలిసి చదువు కున్నాం. మంచి ఫ్రెండ్స్. ఇలా ముగ్గురం మంచి స్నేహితులు అయిపోయాం. బాగా కలిసి పోయాం. రోజు ఫోన్ లో మాటలు, వారాంతంలో సినిమాలు, షాపింగ్ ఇలా సంతోషం గా గడచిపోతున్నాయి. నాకు శృతి కి మధ్య  చనువు బాగా  పెరిగింది. ఇలా రోజులు గడుస్తుండగా పరిమళ పుట్టినరోజు వచ్చింది ........

Saturday, August 31, 2013

అనగనగా ఒక మహానగరం

                         

  అనగనగా ఒక మహానగరం. అదే చెన్నై నగరం. ఉదయాన్నే పక్షుల రాగాలతో సూర్యోదయం. సాయంత్రానికి జనాల హోరులో సూర్యాస్తమయం. పేద్ద పెద్ద రోడ్లు, ఎత్తైన భవనాలు , అయినా అవన్నీ సరిపోనంత జనాలు. అప్పుడప్పుడు వచ్చే బస్సులు, ఎప్పుడూ అక్కడే ఉండే ఆటోలు. అందమైన ఆకాశం, ఎల్లప్పుడూ ఉండే సూర్యుని ప్రతాపం. జీవనోపాధి కోసం  జనాల ఉరుకలు పరుగులు , వాటితో వికసించే ఎన్నో ఆశల జాబితాలు.
ఎప్పుడూ మోగే గుడిగంటలు , అపుడపుడూ వినిపించే church bells. అందమైన సముద్ర తీరం. అలుపెరుగని నీటి కెరటం.
   ఈ మహానగరం లో ఎన్ని జరిగినా తన పని తాను చేసుకుపోయే ఆ సముద్ర కెరటం వలె ఆ రోజు నా మనసు కూడా చుట్టూ ఏం జరుగుతుందో తెలియనంతగా నా శృతి ఆలోచనలతో నిండిపోయింది.  తనని మొదటి సారి కలవటానికి వెలుతున్న నాకు, చెన్నై నగరం అప్పుడే సాన పెట్టిన ముత్యంలా మునుపెన్నడూ లేనంత మధురంగా అనిపిస్తోంది. మనసు అందంగా ఉంటే అన్నీ అందంగా కనిపిస్తాయి అని పెద్దలు అంటారు. ఈ  ప్రేమ నా మనసులో ఉన్న అందాన్ని ఈ రోజు నాకు చూపించింది. అదే ప్రేమ నాలోని రాక్షసుడిని కూడా బయటికి తీస్తుందని ఊహించలేదు. ఒక స్నేహితుడు , ఒక ప్రియురాలు, నేను. మా ముగ్గురు జీవితంలో జరిగిన ఈ నాటకానికి ఈ రోజు సాగర్ శృతి కలయకతో తెరలేచింది. ఇవన్నీ ఊహించలేని అమాయకత్వంతో మనసులో నిండుగా ఎగసిపడుతున్న ఉత్సాహంతో తనని కలవటానికి ముందకు సాగుతున్నా........ 

Tuesday, August 27, 2013

urgent,call me


                        

   తనతో ఎలాగయినా మాట్లాడాలి బయలుదేరిన నాకు అప్పటికే ఆలస్యం అయిందని తెలీదు. ఎంతో ఆశతో బస్ స్టేషన్ కీ వచ్చిన నాకు ఆఖరి బస్సు వెళ్లి పోయింది అని తెలియటంతో ఆలస్యం అయిందని అర్థం అయింది. ఆలస్యం అమృతం విషం అని అనుకొంటూ రైలు స్టేషన్ కి బయలుదేరా. అక్కడ కూడా ఆలస్యం. విచారం తో విమానాశ్రయం వైపు పరుగులు తీసా. కానీ అదేమి అదృష్టమో ఆ రోజుకి ఆఖరి విమానం కూడా వెళ్లిపోయింది. నా ప్రయాణం ఒక రోజు వాయిదా పడిందని అర్థం అయిపోయింది.  కానీ ఆ ఒక రోజు ఆలస్యం నాకు వరమయింది. తన ఫోన్ లో ఉన్న missed call తో తను నాకు పరిచయం అయింది.
     ఉసూరుమంటూ ఇంటికి తిరిగివచ్చిన నాకు ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలకు ఊరట వచ్చింది. నాకు కొత్త నెంబరు నుంచి కాల్ వచ్చింది. చిరాగ్గా ఫోన్ తీశా. అవతలి పక్క ఒక అందమైన స్వరం ఎవరు మీరు అనే ప్రశ్న వేసింది. ఆ స్వరం వినగానే చిరాకు ఎంటో పారిపోయింది. ఒక చక్కటి టీ తాగినపుడు వచ్చిన ఫ్రెష్నెస్ ఎన్నో బీర్లు కొట్టినపుడు ఎక్కే కిక్కు ఒక్క సారిగా నన్ను ఆవహించాయి. తమాయించుకుని ఎవరండీ మీరు అని అడిగా . 

తను : హాయ్ .  నాకు ఈ నెంబర్ నుంచి వారం రోజుల క్రితం " urgent , call me " అని మెసేజ్ వచ్చింది . 

నేను:  ఓకే . నేను ........... వారం క్రితం ..........sorry  అప్పుడు నేను ఫ్రెండ్ పెళ్లి అని రాజోలు లో ఉన్నా .  sure గా 
          ఇదే నెంబర్ నుంచి వచ్చిందా 
  
           ( extra  చేశా కదా )

తను : టెంకి పెళ్లి నే  కదా 
నేను : అవును 
తను : నువ్వు సాగర్ నా?
నేను: అవును . నేను మీకెలా తెలుసు 
    ( మనసులో ఎక్కడా లేని సంతోషం)
తను: నువ్వు ప్రదీప్ ఫ్రెండ్ కదా . అలా తెలుస్తూ ఉంటాయి లే. తనే ఆ రోజు message చేసుంటాడేమో లే 
       ( నేను గాల్లో తేలుతున్నా . తను నాతో మాట్లాడటానికి కారణం కోసం ఈ message సోది చెప్పిందని అర్ధం అయింది )
నేను: అయుంటది . anyway మీ పేరు ?
తను : నా పేరు శృతి . నేను చెన్నై లో work  చేస్తున్నా . 

       ఇలా మొదలయింది మా పరిచయం . ఆ రోజు గంట సేపు మాట్లాడుకున్నాము . తను నా మాటలు వింటూ అలా నవ్వుతూ తిరిగి సమాధానం ఇస్తుంటే జీవితం ఆనందమయం అయిపోయింది అనిపించింది. మేమిద్దరం ఆ తర్వాతి రోజు కలుద్దామనుకుని ఆ రోజుకి మా మాటలు ముగించాం . 
      
            వెంటనే గూగుల్ తీసి తన office అడ్రెసు వెతికా . నేను ఉండే ఇంటి నుంచి తను ఉండే ప్రదేశానికి దారి చూసాకనే నాకు అర్ధం అయింది చెన్నై ఎంత పెద్దదో అని. కానీ నేను తనని చేరుకోవటం లో ఏది అడ్డు రాదు అనుకొంటూ ఆ దారిని జాగ్రత్తగా గుర్తుంచుకున్నా .. మనసులో నా ఆనందానికి  అవధుల్లేవు .  ఆ రాత్రి నిద్ర కూడా పట్టలేదు . చివరకి టైం వచ్చింది . బాగా స్నానం చేసి మంచి డ్రెస్ వేసుకుని బాగా సెంటు కొట్టుకుని బైక్ మీద బయల్దేరా'. ఆ రోజు ఆ మహానగరం ఎంతో అందంగా కనిపిస్తుంది ......................... 

Saturday, August 24, 2013

ప్రయాణం

   
అలా తను నా ఎదురుగా వచ్చి ఆగింది. అప్పటి వరకు నా చుట్టూ స్థంబించిన ప్రపంచం ఒక్కసారిగా వేగం పుంజుకుని గిర్రున తిరిగింది. తల ఎత్తి అలా ప్రకాశించే తన మోము చూసాను. అప్పుడే అందరినీ నిద్రలేపిన సూర్యనివలే  ప్రకాశిస్తున్న ఆ ముఖారవిందం చూసి మైమరచిపోయాను. అలా నవ్వుతూ నా ఎదురుగా ఉన్న ఆ అందం చూస్తూ శిలనై నిలబడి పోయాను. ఎంత సమయం గడిచిందో తెలీదు. ఒక్క సారిగా నా చుట్టూ గిర్రున తిరుగుతున్న ప్రపంచం ఠక్కున ఆగింది. ఏదో వింత శబ్దం చేసింది. మనసులో ఉన్న ఆహ్లాదమంతా చిరాకులా మారింది. అప్పుడే అర్ధమయింది ఇదంతా కల అని.
అవునండీ. అది కలనే.  రోజు రాత్రి నన్ను పలకరించే అందమైన కల.  రోజు ఉదయాన్నే నాలో రాగాలు పలికించే ఆ అందమైన జ్ఞాపకం నా మదిలోకి చేరి వారం అయింది. ఒక స్నేహితుని పెళ్ళికి వెళ్ళి ఈ అందాన్ని చూసా . అప్పటినుంచే నా జీవితం మారింది . ఇదంతా ఒక పెళ్లి లో మొదలయింది కాబట్టే ఆ టైటిల్ పెట్టా . 
ఆ రోజు ఆదివారం . ఉదయాన్నే లేవాల్సిన పని లేదు. రోజు తను కలలో నా ముందుకు వచ్చి ఆగుతుంది కానీ మాట్లాడే లోపే అలారం మూగేస్తుంది . కానీ ఈ రోజు ఆదివారం కాబట్టి తను నాతో ఏం మాట్లాడుతుందో అనే ఆసక్తి తో అలారం పెట్టకుండా పడుకున్నా. ఎప్పటి లానే తను కలలోకి వచ్చింది. ఎదురుగా వచ్చి నుంచొని ఉంది .  నా అదృష్టం ఏంటో CD player లో ఆగిన CD లాగా ఆ scene అక్కడే ఆగిపోయింది . అలా తన ముఖం చూస్తూ మెలకువ వచ్చేసింది. 
అనుకున్నది జరగలేదని విచారంతో టీవీ పెట్టుకుని చూస్తున్నా. ఈ వారం రోజులు అన్నీ తన జ్ఞాపకంతో గడిచింది . ఇంతలో బొమ్మల పెట్టె లో విశ్వనాధ్ గారి డైయలాగు  వచ్చింది . ప్రేమని మనసులో ఉంచుకుని ఆలోచించు కోవటం కంటే ఆ ప్రేమని తెలియచేయటం ఉత్తమం . మన అహం కంటే ఎదుటివారు మనకి ముఖ్యం అని వారికి అర్ధం అయ్యేలా చేస్తే మనలని ఎవరు మాత్రం కాదంటారు. అది విన్నాక నేను ఆ రోజంతా ఆలోచించి తనని కలవాలని నిర్ణయించుకొని బయలుదేరా. 
ఇంతకు ముందు వరకు ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలీదు అన్నాడు ఇప్పుడు ఎక్కడికి బయలుదేరాడు అనుకుంటున్నారా . పెళ్ళిలో నలుగురూ పిలిచినపుడు తన పేరు విన్నా
. నలుగురితో మాట్లాడుతున్నపుడు  తను ఏం చేస్తుందో తెలుసుకున్నా. సాయంత్రం బట్టలు సర్దుకుని ఇక banglore నగరానికి బయలుదేరా. కానీ నాకు తెలియదు అప్పటికే ఆలస్యం అయింది అని......   

Friday, August 23, 2013

పరిచయాలు


                                                 
     
  చినుకులా వచ్చిన వర్ష స్నేహం నా జీవితంలో ఎన్నో అనుభవాలకి ఆరంభం . తన వల్ల నాకు ప్రేమ పరిచయం అయింది . తను నన్ను కాదనుకుని వెళ్లిపోయినపుడు నాకు బాధ పరిచయం అయింది . ఆ బాధలో నా స్నేహితుడి అండ స్నేహాన్నినాకు పరిచయం చేసింది . వర్ష నన్ను వదలటానికి కారణం నా చుట్టూ వుంటూ స్నేహం పేరుతో జరిగిన వంచన అని తెలిసినపుడు నాకు ద్వేషం పరిచయం అయింది . ఆ ద్వేషమే నాకు కోపాన్ని పరిచయం చేసాయి . ఆ సమయంలో నా ఆలోచన దారి మళ్ళింది . ఇంత అవకాశం ఎదుటివాడికి ఇచ్చినందుకు నా మీద నాకు కోపం వచ్చింది . దాంతో నాకు కసి పరిచయం అయింది . నేనున్నా అంటూ కొత్త స్నేహం చేయి అందించింది .
ఆ నాటి కసి నా జీవితానికి మంచి మలుపునిచింది . నా జీవితం నా లోకం నుంచి మన లోకం ఆయింది. ఈరోజు నేను అని చెప్పుకునే నన్ను ఆ సంఘటనే మలిచింది . ఈ ప్రయాణంలో నాతో పాటు నడచిన నా స్నేహితుని జీవితం  , నా జీవితం నా దేవత వల్ల మళ్ళి మారాయి. అదేంటో ఇకపై వచ్చే నా ప్రేమకథలో చదవండి . 

తను

       


  తన పేరు : తెలీదు
  తన ఊరు : తెలీదు
  తను ఎవరు : తెలీదు
   నేను ఎవరు : మర్చిపోయాను

       తనని చూసిన క్షణం ఇదే నా పరిస్థితి . ఆ క్షణం వరకు తనేవ్వరో నాకు తెలీదు . తనని చూసాక నేను ఏంటో నాకు పట్టింపు రాలేదు . అందమైన ఆ కళ్ళని చూడగానే నా  కాళ్ళు నడకని ఆపేశాయి . చంద్రబింబం వంటి ఆ మోము చూసాక ఈ ప్రపంచమే నా దృష్టిలో విలువను కూల్పోయింది . అన్నిటికంటే విలువైనది నా కళ్ళ ముందుకి వచ్చిన భావన కలిగింది . ఆ క్షణం నా ప్రపంచమే స్తంభించింది. అలా దూరంగా నుంచొని తన చిరునవ్వుని చూస్తూ ఉండిపోయా . ఆ రాత్రి ఎపుడు కరిగిందో గుర్తులేదు . ఉదయం కళ్ళు తెరవగానే తన జ్ఞాపకమే కళ్ళ ముందు కదిలింది కాని తను కనిపించలేదు ....

ఏంట్రా వీడు ఇందాక కాలేజీ అన్నాడు ఇపుడేమో రాత్రి చూసా అంటునాడు అని అనుకుంటునారా . అవునండి . ఈ బ్లాగు వర్ష కోసం కాదు. నేను చూడగానే ప్రేమించిన నా దేవత కోసం

        తను ఎక్కడ ఉందా అని వెతుకుతున్న నా నయనాలని కాదని నా మనసు వినిపిస్తున్న గజ్జెల చప్పుడు వైపు నా చూపు తిప్పింది . పరికిణీలో ఆ బాపు బొమ్మ నా ముందు ప్రత్యక్షమయింది . పల్లెటూరి అమాయకత్వం తో కనుబొమ్మలు  ఆడిస్తూ  నా వైపే వచ్చింది . అలా వచ్చి నా ఎదురుగా ఆగింది ............. 

Thursday, August 22, 2013

నేను


నేను ఇది అని నా గురించి నేను చెప్పుకునేలా నాకంటూ నేనేమీ చేసుకోలేదు. చిన్నతనంలో అమ్మ చాటు కొడుకుని నేను. అమ్మ ఉందని ఇంట్లో అమ్మ పంపిందని బడిలో ఉండేవాడిని. చదువు ఉంటే చాలు జీవితంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా బ్రతికేయొచ్చు అనే భ్రమలో అమాయకత్వానికి అడ్రసులా భయానికి కజిన్ బ్రదర్ లా ఉండేవాడిని. ఫలితంగా ఐఐటీలో ప్రవేశం కూడా లభించింది. కానీ ఆ ఐదు సంవత్సరాల చెన్నై జీవితం నా భ్రమలన్నీ తొలగించింది. ప్రేమ, ద్వేషం, స్నేహం, శతృత్వం, బాధ, ఆనందం ఇలా మనసులో కలిగే ప్రతి భావనను నాకు పరిచయం చేసింది. ఒక అమ్మాయి పరిచయం నా జీవితాన్నే మార్చేసింది. ఆ రోజు స్వాతంత్ర్య దినోత్సవం. అప్పటికి నా జీవితంలో భ్రమలన్నీ తొలగి అమాయకత్వం , భయం మాత్రం మిగిలాయి. జెండా వందనం చేసి ఏదో ఆలోచిస్తూ కూర్చొని ఉన్న నా మోడువారిన జీవితంలోకి చినుకులాగా వచ్చింది నా వర్ష...........

Wednesday, August 21, 2013

ఆరంభం

                 
                   
                    అద్భుతమైన సువాసన ముక్కుకి తగిలినప్పుడు, నచ్చిన రుచి నాలుకకి అందినపుడు, శ్రావ్యమైన సంగీతం చెవులకి వినిపించినపుడు,నచ్చిన వారి స్పర్శ తగిలినపుడు మన మనసు ఆ పరిమళాన్ని ఆస్వాదిస్తుంది. తనని మొదటిసారి చూసినపుడు అలాంటి పరిమళమే నా మనసుని తాకింది. ఈ కథకు ఆరంభం ఇక్కడే.
"LOVE AT FIRST SIGHT" అని ఎక్కడైనా వింటే నవ్వుకునే వాడిని. కానీ తనని చూసిన క్షణం నాలో కలిగిన భావనకు వేరే explanation లేదని అనిపిస్తుంది. మొదటి సారి తనని చూసిన క్షణం తన పేరు కూడా నాకు తెలీదు. కానీ ఎలా కనిపెట్టిందో నా మనసు మాత్రం జీవితాంతం తన పక్కనే ఉండమని చెప్పింది . అసలు తను ఎవరు , నేను  ఎవరు, మా ఇద్దరి పరిచయం ఎలాంటి మలుపులు తిరిగింది ఇలా మీ మనసులో మెదులుతూ ఉన్న చాలా ప్రశ్నలకు నా బ్లాగు సమాధానం . మీ అభిప్రాయాలని కామెంట్లతో నాకు తెలియచేయండి . ఈ రోజుకి శెలవు