Monday, September 9, 2013

సూర్యోదయం

     
                                         



            అలా ఫణి చెప్పిన మాటలు విని శృతి నా మీద చిరాకు పడటంతో నాకు ఇక ఆ రోజు రాత్రి నిద్ర రాలేదు. బాధ తో సోఫా మీద కూలిన నాకు మనసంతా అదే ఆలోచన. కానీ రోజంతా అలసిన శరీరం విశ్రాంతి కోరటంతో, ఎప్పుడు జరిగిందో గానీ నేను నిద్రలోకి జారుకున్నా. శరీర అలసట తీరగానే మెలకువ వచ్చేసింది. అప్పటికి ఉదయం ఐదు అయింది. అంతలోనే శృతి గర్తొచ్చేసింది. ఇక మళ్ళా పడుకోవాలని అనిపించలేదు. లేచి beach కి బయలుదేరా.
                 సముద్రం. తన లోపల ప్రశాంతతని దాచుకొని , ఒడ్డున మాత్రం గంభీరంగా అలలతో ఎగిసిపడే సముద్రం అంటే నాకు చాలా ఇష్టం. చెప్పాలంటే సముద్రం మన జీవితాలని ప్రతిబింబిస్తుంది అని నా ఫిలాసఫీ అండి. సముద్రలో ఉన్న నీరు మన మనోభావాలను పోలి ఉంటుంది. ప్రపంచం లో 90 శాతం మంది ప్రజలు వారి దైనిక జీవితంతో తృప్తి చెంది అప్పుడప్పుడు కలిగే చిన్న చితకా ఆటుపోట్లతో , సముద్రం మధ్యలో ఉన్న నీరు వలె ప్రశాంతంగా కాలంతో సాగిపోతూ  ఉంటారు. మరికొందరు ఏదో సాధించాలనే తపనతో సముద్రపు కెరటాల వలె ఎగసి పడుతూ  ఉంటారు. ఎగసి పడిన కెరటాన్ని సముద్రం వెనక్కి లాగినట్టు జీవితం కూడా ఎన్నో ఆటంకాలను ఎదురుగా నిలిపి వారిని వెనక్కి లాగుతది. కొన్ని కెరటాలు ఒడ్డునే ఆగిపోతాయి. కొన్ని మాత్రం కొంచెం ముందు వరకు వచ్చి ఆగుతాయి. అలానే జీవితం ఎన్నో ఆటంకాలతో వెనక్కి లాగినా ఒక్కొక్కరు వారి వారి బలాలని బట్టి ముందుకు సాగుతూ  ఎంతో కొంత సాధిస్తూ ఉంటారు.  అలాంటి సముద్రం ఒడ్డున కూర్చొని సూర్యోదయం చూడటం అంటే నాకు చాలా ఇష్టం . ఏదో తెలియని ప్రశాంతత ఉంటుంది. ఆ రోజు ఆ ప్రశాంతత కరువయింది కాబట్టే ఉదయాన్నేనిద్ర పట్టక బీచ్ వైపు అడుగుల వేశా.
           అలా బీచ్ లో కూర్చొని సూర్యోదయం చూస్తూ శృతి గురించి ఆలోచిస్తూ ఉన్నా. ఇంతలో నా మొబైల్ మోగింది. అది శృతి నంబరు. ఫోన్ లో పచ్చ బటన్ నొక్కి చెవి దగ్గరకి తీసుకువచ్చా.
నేను : హలో
శృతి :  హలో
నేను : హలో
శృతి : హాయ్ సాగర్
నేను : హాయ్
( మా ఇద్దరికీ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఒక క్షణం సైలెన్స్ తర్వాత .......)
నేను : ఏం చేస్తున్నావు?
శృతి : బీచ్ లో ఉన్నా.
నేను : ఇంత పొద్దున అక్కడేం చేస్తున్నావు?
శృతి : నువ్వేం చేస్తున్నావో అదే చేస్తున్నా.
నేను : నేను బీచ్ లో ఉన్నా అని నీకెవరు చెప్పారు?
శృతి : నాకు కల వచ్చింది ( నవ్వుతూ  )
నేను: hmm .... ఇంతకీ బీచ్ లో ఎక్కడ?
( నా కళ్ళు తను కోసం దూరంగా వెతకసాగినాయి )
శృతి : మన మనసుకి నచ్చే వాళ్ళు ఎప్పుడూ మన ప్రక్కనే ఉంటారు సాగర్. మనమే అది అర్థం కాక ఎక్కడో వెతుకుతూ ఉంటాం. దూరంగా కాదు దగ్గరగా చూడు నేను కనిపిస్తా.
అలా తను అనగానే వెనక్కి తిరిగి చూసా. చంద్రబింబం  వంటి ముఖారవిందంతో నా శృతి ఎదురుగా నుంచొని ఉంది.  తనని చూడగానే అన్నీ మర్చిపోయా. తనని చూసిన ఆనందం లో ఏం మాటలు రాలేదు . తను నా దగ్గరకు వచ్చి , నా అరచేతిని తన అరచేతిలో తీసుకొని ," సారీ రా సాగర్ . రాత్రి ఫణి అలా చెప్పేసరికి బాగా కోపం వచ్చింది . అందుకే చిరాగ్గా మాట్లాడా " అంటూ నా పక్కకి వచ్చి , నా  భుజం మీద తల పెట్టి " నాకు నీ మీద నమ్మకం ఉంది రా . నువ్వు అలా చెయవు. ఇంకెవరన్నా అలా చేసారు అంటే నమ్మేదాన్ని. కానీ నువ్వలా చేస్తావంటే ఎవరు చెప్పినా నమ్మను . ఐ am
రియల్లీ సారీ రా" అంది . నేను తన తల నిమిరి ఒక చిన్న నవ్వు నవ్వా . నాకు ఆ క్షణం బాగా నచ్చింది . నేను , తను చేతిలో చెయ్యి వేసుకొని బీచ్ లో నడుచుకుంటూ ఆ ఉదయాన్ని గడిపాము . ఆ క్షణంలో మా ఇద్దరి మధ్య ప్రేమ మొదలయింది . ఈ సంఘటన జరిగి వలనే మేము ఒకరి గురించి ఒకరం రాత్రంతా ఆలొచించామ్. అపుడే అర్ధం అయింది మాకు ఒకరంటే ఒకరికి ఎంత నమ్మకం, గౌరవం , ప్రేమ . అప్పటివరకు మా ఇద్దరి మధ్య ఉన్న ఇష్టం ఆ రోజు ప్రేమగా మారింది .......
మరి అది ఎలా బయట పెట్టాం ? ....to  be  continued...............:)

                  

No comments:

Post a Comment