Sunday, September 8, 2013

నేను శృతి మధ్యలో ఫణి

  
                             

         ఆ రోజు పరిమళ పుట్టినరోజు. తను ప్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చింది. అందరం తన పుట్టినరోజుని బాగా జరిపాం. తను కూడా చాలా హ్యాపీ గా ఉంది. కానీ నేను ఆ పార్టీ లో ఒకటి గమనించా. శృతి ఫణితో గొడవపడటం. ఫణి ఎవరు మధ్యలో అని అనుకుంటున్నారా. ఫణి నాకు పరిమళ కి స్కూల్ ప్రెండ్. అంతేకాదు శృతి కి సహోద్యోగి. ఆ విధంగా అతను మా ముగ్గురికి పరిచయం. ఎందుకో తెలీదు కానీ మా ముగ్గురిలో ఉన్న చనువు ఫణికి మాకు లేదు. పైగా తనకి శృతి మీద క్రష్ కూడా. తనని ఇంప్రెస్ చేయటానికి అప్పుడప్పుడు కొన్ని వెధవ ప్రయత్నాలు కూడా చేసేవాడు. కానీ శృతికి నా మీద ఉన్న ఇంట్రెస్టు వల్లనో లేక వేరేమిటో గానీ ఫణి ప్రయత్నాలు ఏమి ఫలించేవి కావు. అప్పుడప్పుడు అవి శృతి చిరాకు కూడా తెప్పించేవి. మాతో చెప్తూ ఉండేది.
   ఇక విషయం లోకి వస్తే పరి పుట్టినరోజు పార్టీలో శృతి ఫణిని తిడుతూ  కనిపించింది. దగ్గరకు వెళ్లి ఏమైంది అని అడిగా. తను ఏం లేదు అని అక్కడి నుంచి వెళ్లిపోయింది. సరే పార్టీ మధ్యలో సీన్ ఎందుకు లే తర్వాత అడుగుదామని నేను వదిలేసా.  పార్టీ అయిపోయింది. నేను నా కారులో పరీని శృతి ని వాళ్ళ రూమ్ లో వదలి నా రూమ్ కి వెళ్లా. స్నానం చేసి ప్రశాంతంగా కూర్చున్నా.  ఇక ఫోన్ పట్టుకొని ఏమైందో తెలుసుకుందామని శృతి కి కాల్ చేసా.  కానీ శృతి చాలా చిరాకుగా నాకు నిద్ర వస్తుంది అని ఠక్కున పెట్టేసింది. చాలా బాధ వేసింది. కొంతసేపటికి పరీ కాల్ చేసింది. ఏరా ఒంటరిగా కూర్చుని బాధ పడుతున్నావా అని అడిగింది . ఛ , అలాంటిది ఏం లేదు రా . నిద్ర రావట్లేదా అని అడిగా . నోరు ముయ్యి రా. మీతో ఉంటూ  నేను ఆ మాత్రం గమనించనా . నాకు తెలుసు లేరా అని పరి అంది . సర్లే గాని ఇంతకీ ఏమైంది , ఎందుకు శృతి అలా చిరాగ్గా ఉంది అని అడిగా . అప్పుడు పరీ అసలు విషయం చెప్పింది . 

                      " మనం ఈగ సినిమా చూడటానికి వెళ్ళిన రోజు గుర్తుందా . ఆ రోజు నువ్వు నేను థియేటర్ దగ్గర వెయిట్ చేస్తున్నాం . ఇంతలో  ఫణి ఫోన్ మాట్లాడుతూ వచ్చాడు కదా . నీకు ఎవరో తెలిసిన వాళ్ళు కనిపించారని ఫోన్ నాకు ఇచ్చి, శృతి ఎక్కడ ఉందో కనుక్కోమని చెప్పి, వాళ్ళని పలకరించటానికి వెళ్ళావు. అప్పుడు నేను నీ ఫోన్ నుంచి శృతి కి కాల్ చేస్తే బిజీ వచ్చింది .  ఎందుకంటే అప్పుడు ఫణి మాట్లాడుతుంది శ్రుతితోనే  కాబట్టి .  ఫోన్ పెట్టేశాక వాడు నా దగ్గరకు వచ్చి చేతిలో నీ ఫోన్ చూసి "సాగర్ ఫోన్ నుంచి కాల్ చేసింది నువ్వెనా . call waiting వస్తోంది అని చెప్పింది శృతి . ఈ మధ్య  తను మన ముగ్గురిలో నాకు preference ఇస్తోంది . సాగర్ గాడు పాపమ్. పిచ్చోడిలా దానికి ట్రై చేస్తున్నాడు " అన్నాడు . వాడు ఆ మాట అనగానే నా మైండ్ బ్లాక్ ఆయింది .  నువ్వు నీ  ఫ్రెండ్స్ తో మాట్లాడి వచ్చేసరికి శృతి కూడా వచేసింది . ఇక నేను కూడా నీకేమి చెప్పలేదు ఆరోజు . అక్కడితో ఆ విషయం మర్చిపోయా . ఈ రోజు పార్టీలో ఫణి శ్రుతితో అన్నాడంట " ఈ  మధ్య సాగర్ , నువ్వు అతనితో కంటే నాతో close వుంటున్నావని  నాతో అంటూ ఉంటాడు . అలా ఏం లేదు అన్నా వినిపించుకోడు. ఈగ సినిమా రోజు నేను నీతో మాట్లాడుతున్నా కదా. అప్పుడు నీకు కావాలని కాల్ చేసాడు.  నువ్వు నా కాల్ కట్ చేసి వాడి కాల్ తీయలేదని , నువ్వు వాడిని దూరంగా పెట్టి నాకు దగ్గరా వస్తున్నావు అని నా తల తినేసాడు ఆ రోజు" అని చెప్పాడంట . ఇంకేముంది దానికి కోపం ,చిరాకు వచ్చేశాయి . అందుకే నీతో మాట్లాడలేదు. నేను తనకి ఫణి అబద్దం చెప్తున్నాడు , అని జరిగిన విషయం చెప్పా . కాని తను కోపంగా ఏం మాట్లాడకుండా రూం లోకి వెళ్ళిపోయింది . " అని పరీ  చెప్పింది . 

                 ఇదంతా విన్నాక నాకేం అనాలో తెలియలేదు . కాని శృతి నా మీద కోపంగా ఉందని తెలిసాక నాలోని ప్రశాంతత ఎక్కడికో పరుగెత్తుకు వెళ్లిపోయింది . నాలో ఒక తెలియని అసహనం . నిద్ర రాలేదు . ఎలాగయినా ఉదయాన్నే తనని కలిసి జరిగింది చెప్పాలి , మనసులో ఉన్న భారం దించాలి అని అనుకొంటూ అలా సోఫా మీద కూర్చొని ఎపుడెపుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నా .................

           


No comments:

Post a Comment